రామంతాపూర్‌లో హైటెన్షన్

12-09-2026 | 04:45am

జీవో 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 

మద్దతుగా బీజేవైఎం నిరసన

పోలీసులు, బీజేవైఎం నేతల మధ్య తోపులాట, పలువురి అరెస్ట్

ఉప్పల్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(Government Polytechnic College) వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో 97ను రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థులు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం బీజేవైఎం నేతలు నిరసనకు దిగడ ంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కళాశాల గేటులోపలికి వెళ్లేందుకు కొందరు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం నేతల మధ్య తోపులాట జరగడంతో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా విద్యార్థుల నిరసనకు పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది సైతం మద్దతు ప్రకటించారు. ప్రిన్సిపాల్ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వ రకు సిబ్బంది ర్యాలీ నిర్వహించి సంఘీభా వం తెలిపారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అభ్య సిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులపై జీ వో 97 ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యాపకులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్’ పేరుతో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జ రుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గణేష్ తదితరులు పాల్గొన్నా రు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉప్పల్ జో న్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు