అన్ని రైళ్లు ఆపాలి

28-09-2026 | 07:42pm

మెట్‌పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రతి రైలు నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ ఆధ్వర్యంలో పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజల సంతకాల సేకరణను చేపట్టారు.ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర రైల్వే మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు పోస్టు ద్వారా పంపించి, మెట్ పల్లి ప్రాంత ప్రజల రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ.... మెట్ పల్లి, పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, న్యాయపరమైన మరియు ఇతర అవసరాల కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రైల్వే సౌకర్యాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్–కాజీపేట వయా కరీంనగర్ మార్గంలో ప్రతిరోజూ రైలు సర్వీసును ఏర్పాటు చేయాలని, అలాగే కాచిగూడ–కరీంనగర్ మార్గంలో అదనపు రైళ్లను నడపాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు