ఐలమ్మకు ఘన నివాళి

26-09-2026 | 10:06pm

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామం(mogilipeta village)లో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి(illamma jayanthi) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కళ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఐలమ్మ చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆమె అందించిన స్ఫూర్తిని కార్యక్రమంలో పాల్గొన్న వారు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు