ఉచిత నేత్ర వైద్య శిబిరం

26-09-2026 | 10:15pm

ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): ఖమ్మం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి(Max Vision Eye Hospital) సహకారంతో తల్లంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం(Free Eye Camp ) నిర్వహించారు. ఈ శిబిరంలో 130 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు.

తల్లంపాడు గ్రామ సర్పంచ్ అంబేద్కర్ శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం సామాజిక బాధ్యతలో భాగమన్నారు. విద్యార్థులు సేవాభావంతో సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ జాతీయ సేవా పథకం స్ఫూర్తితో విద్యార్థులు సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు.

కార్యక్రమంలో డీన్ డాక్టర్ వి. సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, శిక్షణ, ఉద్యోగ నియామకాల అధికారి డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇన్‌చార్జి కృష్ణ ప్రసాద్, కార్యక్రమ సమన్వయకర్త నరేష్, విద్యార్థి సేవా పథకం వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు