టైపు రైటింగ్‌లో హాసిని ప్రతిభ
ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్వహించిన టైపు రైటింగ్ జూనియర్ గ్రేడ్ పరీక్షల్లో బాబా టైప్ రైటింగ్ అండ్ షార్ట్‌హ్యాండ్ ఇన్స్టిట్యూట్(Typewriting and Shorthand Institute) విద్యార్థిని కావేటి హాసిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా(Khammam District) బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తోట రామారావు హాసినిని అభినందించి ఉత్తీర్ణత పత్రాన్ని అందజేశారు. టైపింగ్ నైపుణ్యం ప్రస్తుత కాలంలో ఎంతో ఉపయోగకరం.
విద్యార్థులు చిన్న వయసు నుంచే ఇలాంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. హాసిని ప్రతిభను అభినందించిన ఆయన, విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న బాబా టైప్ రైటింగ్ అండ్ షార్ట్‌హ్యాండ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ బాబాను అభినందించారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు, వంగాల వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్, అబ్దుల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.