జర్నలిస్టు కుటుంబానికి అండగా జగిత్యాల ప్రెస్ క్లబ్

20-11-2026 | 07:59pm

జగిత్యాల, నవంబర్ 20 ( విజయక్రాంతి ) : జర్నలిస్టుల సంక్షేమం(Welfare of Journalists), వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా జగిత్యాల ప్రెస్ క్లబ్(Jagtial Press Club) మరోసారి తన బాధ్యతను చాటుకుంది. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బద్దెనపల్లి మల్లేశం(Press Club Vice-President Baddenapalli Mallesham) తండ్రి  కొమురయ్య మృతి చెందడంతో, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ క్లబ్ తరఫున రూ.10116 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహించడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం పట్ల కూడా సంఘం బాధ్యతగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. సభ్యుల కుటుంబాల్లో ఎదురయ్యే కష్టసుఖాల్లో ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోధైర్యంతో ఉండాలని కోరారు.

మరిన్ని వార్తలు