ఏఐటియుసి 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

20-11-2026 | 07:56pm

 ఏ టి యు సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారామ్.

తుంగతుర్తి (విజయక్రాంతి) : ఈనెల 22 నుంచి 26 వరకు బెంగళూరులో(Bengaluru) జరగనున్న ఏఐటియుసి జాతీయ(AITUC National) 43 వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది గుగులోత్ రాజారామ్ పిలుపునిచ్చారు నేడు సివిల్ సప్లై హమాలి యూనియన్(Civil Supplies Hamali Union) సమావేశంలో ఏటిసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  గుగులోతు రాజారాం పాల్గొని, మాట్లాడుతూ ఏఐటియుసి 43వ జాతీయ మహాసభల్లో 22న బహిరంగ సభ, ఆ తర్వాత ఎంపిక చేయబడిన ప్రతినిధుల మహాసభ 26 వ తేదీ  వరకు నిర్వహించబడుతుందని, ఈ మహాసభలలో  దేశవ్యాప్తంగా కార్మిక రంగం(Labor Sector) ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొంకురి శ్యాంసుందర్ , తుంగతుర్తి నియోజకవర్గ  అధ్యక్షులు కోట రామస్వామి,  లక్ష్మయ్య ,మల్లెపాక సుధాక,ర్ బొంకురి రవి, ఈశ్వర్ ,అవిలయ్య నరసయ్య, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు