యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు జామ కిరణ్ కుమార్ అరెస్ట్
ఘట్ కేసర్, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన ఐశ్వర్య(Aishwarya) (22) ఆత్మహత్యకు(Suicide) పాల్పడి మృతి చెందిన ఘటనలో నమోదైన కేసుకు(Registered case) సంబంధించి నిందితుడు జామ కిరణ్ కుమార్‌ను ఘట్‌కేసర్ పోలీస్ బృందం శుక్రవారం అరెస్ట్ చేసింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా మృతురాలికి నిందితుడితో ఉన్న ప్రేమ సంబంధం, వివాహ ప్రతిపాదనకు సంబంధించిన వివాదంపై పోలీసులు ఆధారాలు సేకరించారు. విచారణలో లభించిన సమాచారం, సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, చట్టప్రకారం తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు సీఐ కిరణ్ తెలిపారు.