డిసెంబర్ 2న సత్తుపల్లిలో సీపీఐ 'జైలు భరో'!
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ
సత్తుపల్లి. నవంబర్ 20. ( విజయ క్రాంతి ): సిపిఐ(CPI) దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబరు ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే కార్యక్రమం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారువిజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన విలేకరుల సమావేశం అయిన మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తూ రైతులు(Farmers) పేదలు సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితుల్లో దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు(Corporate companies) అప్పగించి దేశ సంపాదన కొల్లగొడుతుందని దీనికి నిరసనగా నిరసనగా రైతాంగ సమస్యల(Farmers' issues) పరిష్కరించాలని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని సామాన్య మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారాలు తగ్గించి పేద సామాన్య ప్రజలను ఆదుకోవాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ జైలు బరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనిఈ జైలు బరో కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నెల రెండవ తేదీ కల్లూరు లో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మందితో కార్యక్రమం జరుగుతుందని కావున దీని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు