ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
జెడ్పి సీఈవో చందర్ నాయక్
జుక్కల్, నవంబర్ 20 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను(government welfare schemes) సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జెడ్పి సీఈఓ చందర్ నాయక్(Kamareddy ZP CEO Chandar Naik) అన్నారు. జుక్కల్ మండలం(Jukkal Mandal) బస్వాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి(Indiramma Life Insurance Scheme) ప్రతి ఒక్క రేషన్ కార్డు(Ration Card) లబ్ధిదారుడు దరఖాస్తు(Beneficiary Application) చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఆయా గ్రామాల కార్యదర్శి లు ఎంపీడీవోలకు అందజేయాలన్నారు.
19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వయసున్న కుటుంబ యజమానులు అర్హులన్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే జిపి సిబ్బంది దరఖాస్తులోని వివరాలను ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఈసీ స్వామిదాస్, సర్పంచ్ రమణ సురేష్, ఉప సర్పంచ్ అనిల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.