ప్రజా సంక్షేమమే లక్ష్యం.. ఇందిరమ్మ జీవిత బీమాకు శ్రీకారం
ఎమ్మెల్యే రాగమయి దయానంద్
సత్తుపల్లి నవంబర్20( విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజల అవసరాలను గుర్తిస్తూ,వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే సంక్షేమ పథకాలను(welfare schemes) క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని,నిరుపేదలకు కుటుంబ యజమాని కోల్పోతే వారికి అండగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.. 5 లక్షల రూపాయల ఉచిత బీమా ఇందిరమ్మ భీమా పథకాన్ని(Indiramma Insurance Scheme (Free Insurance)) రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand) శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ జీవిత బీమా అనే అద్భుతమైన పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కుటుంబంలో యజమాని కోల్పోతే ఆదాయ మార్గాలు కోల్పోయి,వారి జీవన మార్గాలు రోడ్డున పడేవని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 18సంవత్సరాలు దాటి 59సంవత్సరాలు గలిగిన వారికి ప్రీమియం ప్రభుత్వమే భరిస్తూ ఏ విధంగా చనిపోయినా, రూ..5 లక్షల రూపాయలను నామినీకి వారి అకౌంట్ కి జమ చేస్తారని, ఈలాంటి బృహత్రమైన పథకం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని అన్నారు.
ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని,ఉపయోగించుకోవాలని సూచించారు. ఆమె స్వయంగా కొందరివి ఆన్లైన్ చేసి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహా, చల్లగుల్ల కృష్ణయ్య, పింగళి సామేలు, వార్డ్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.