కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మల్లాపూర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Constituency MLA Sanjay Kumar) లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల 3 వేల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్,ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.