కొండగట్టు అంజన్న నిజరూప దర్శనంలో స్పీకర్ ప్రసాద్ కుమార్

20-11-2026 | 07:01pm

మల్యాల, నవంబర్ 20, ( విజయక్రాంతి ): మల్యాల(Malyala) కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి(Kondagattu Sri Anjaneya Swamy) నిజరూప దర్శనం చేసుకోవడం తన పూర్వజన్మ సుకృతమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Legislative Assembly Speaker Gaddam Prasad Kumar) అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసే శక్తిని ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Chief Minister Revanth Reddy) మరింత బలాన్ని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

శుక్రవారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన నిజరూప దర్శన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్,ఎస్పీ అశోక్ కుమార్ లు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు