అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అందజేత
లబ్ధిదారులకు పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ
కొండపాక, నవంబర్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను(welfare schemes) అందిస్తూ వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తోందని తిప్పారం సర్పంచ్ ఆకుల భద్రప్ప(Thipparam Sarpanch Akula Bhadrappa) అన్నారు. ఈ సందర్భంగా లక్డారం గ్రామంలో నూతనంగా పింఛన్లు(Pensions) మంజూరైన వితంతు, దివ్యాంగ లబ్ధిదారులకు(Beneficiaries) గ్రామ సర్పంచ్ శిల్ప, తిప్పారం సర్పంచ్ ఆకుల భద్రప్ప మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
అదేవిధంగా మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు తమ కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను లక్డారం సర్పంచ్ శిల్ప లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిప్పారం సర్పంచ్ ఆకుల భద్రప్ప, కందుకూరి ఐలయ్య, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.