కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ

20-11-2026 | 06:22pm

చర్ల, విజయక్రాంతి : చర్ల మండలంలోని(Charla Mandal) సివిల్ సప్లై కొనుగోలు కేంద్రాల్లో(Civil Supply Purchasing Center) ఎమ్మార్వో శ్రీనివాస్(MRO Srinivas), ఆత్మ కమిటీ చైర్మన్ ఇందల గోపాల బుచ్చిబాబు శుక్రవారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2460, బోనస్ రూ.500 కలిపి మొత్తం రూ.2960 రైతుకు అందుతుందని తెలిపారు.

ఆత్మ కమిటీ చైర్మన్ బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రైవేటు వ్యాపారస్తులు, బ్రోకర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. అందుకే చర్ల, దుమ్ముగూడెం మండలాల రైతులంతా ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఇవ్వాలని కోరారు.

కార్యక్రమంలో రైతులు కొమరం సత్యనారాయణ, జగదీష్, సిద్ది లక్ష్మణ్, ముప్పిడి రమేష్, కృష్ణార్జునరావు, పీఏసీఎస్ తరఫున సంతోష్ రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు