జీవిత బీమా పేదలకు ఆర్థిక భరోసా...

23-11-2026 | 11:13pm

ములుగు, నవంబర్ 23 (విజయక్రాంతి): నిరుపేదలందరికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme) ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని నరసింహసాగర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధికార ప్రతినిధి తాతినేని హరికృష్ణ మాట్లాడుతూ నాయకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఈ పథకం అర్హులైన కుటుంబాలకు భరోసా కల్పించే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంగపేట మండల కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి తాతినేని హరికృష్ణ, గ్రామ అధ్యక్షుడు అన్నాల నరసింహారావు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ నెంబర్ మురుకుట్ల నరేందర్, గ్రంథాలయ సంస్థ జిల్లా సభ్యులు గాదె శ్రవణ్,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యం, అన్నాల నరసింహారావు, దోమల నరేందర్, గూడూరు రవి, గూడూరు వెంకన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు