400 మీటర్ల నూతన తాగునీటి పైపులైన్‌కు సర్పంచ్ వినతి
23-11-2026 | 11:15pm
ధర్మపురి, నవంబర్23 (విజయక్రాంతి): వెల్గటూర్ గ్రామం(Velgatoor Village)లోని 3, 6, 9వ వార్డుల ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు సుమారు 400 మీటర్ల నూతన పైపులైన్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ బండమీది కవిత-గోపీ కోరారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఎంపిడిఓ వెంకటప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఆయా వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, నూతన పైపులైన్ నిర్మాణానికి అవసరమైన నిధులను మండల పరిషత్ నిధుల నుండి మంజూరు చేసి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.