పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో వేలం పాట వాయిదా
28-10-2026 | 09:44pm
పాలకుర్తి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో(Sri Someswara Lakshmi Narasimha Swamy Temple) గురువారం నిర్వహించవలసిన కొబ్బరికాయలు, వాహన పూజా సామగ్రి (అభిషేకం పూజా సామగ్రి మినహాయించి), తలనీలాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం రెండవసారి నిర్వహించాల్సిన సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం పాట 2 వాయిదా పడింది.
వేలం పాట దారులు షెడ్యూలు కొనుగోలు చేయకపోవడంతో వేలాన్ని వాయిదా వేసినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి వేలం పాట నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.