ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
26-11-2026 | 12:24pm
బచ్చన్నపేట, నవంబర్ 26 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ (Constitution Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా రాజ్యాంగ పీఠికను (Preamble) చదివి ప్రతిజ్ఞ చేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యానికి (Democracy) పునాదులని వివరించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను (Fundamental Duties) గుర్తించి నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివరాత్రి రాజు, గంధమల్ల మాధవి, చంద్రమ్మ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.