తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు

26-11-2026 | 08:19am

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 12 గంటల సమయం పడుతోంది.

మరోవైపు బుధవారం ఒక్కరోజే 74,873 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుంటూ 22,810 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఒక్కరోజులోనే రూ.3.38 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఏర్పాట్లు కొనసాగిస్తోంది. తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు దర్శన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు