తెలంగాణకు చంద్రబాబు
భద్రాద్రి కొత్తగూడెం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోనున్నారు. పాల్వంచలోని నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయం(Navabharat Venkateswara Temple)లో నిర్వహించనున్న ప్రత్యేక సుదర్శన హోమం(Sudarshana Homam) ఈ పర్యటనలో ప్రధాన కార్యక్రమంగా ఉండనుంది.
త్రిదండి చినజీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) ఆధ్వర్యంలో ఈ హోమ క్రతువు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించింది. హెలిప్యాడ్, రవాణా, భద్రత తదితర అంశాలపై అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.