వాకింగ్‌కు వెళ్లిన బీఆర్ఎస్ నేతపై దాడి
నాగర్ కర్నూల్: జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. కోడేరు మండలం తీగలపల్లిలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం.. భాస్కర్ రెడ్డి ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. తొలుత కారం చల్లి, అనంతరం కర్రలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం పూట జరిగిన ఈ దాడితో తీగలపల్లిలో ఆందోళన నెలకొంది. దాడి చేసింది అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. భాస్కర్ రెడ్డిపై దాడికి పాల్పడినవారు ఎవరు? దాడికి గల కారణాలేమిటి? అనే అంశాలు తెలియాల్సి ఉంది.