బాల్యం నుంచే విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం

13-11-2026 | 06:37pm

హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి

దేశాభివృద్ధికి పాటుపడాలి

కొండపాక, నవంబర్ 13:( విజయక్రాంతి): బాల్యం నుంచే విద్యార్థులు చట్టాలపై(Students of the law) అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కె. సౌజన్య అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని(National Children's Day) పురస్కరించుకుని శుక్రవారం దుద్దెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Duddeda Zilla Parishad High School) ప్రధానోపాధ్యాయురాలు జి. రజిని(Headmistress G. Rajini) అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చైల్డ్ జువెనైల్ యాక్ట్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, ఇంటర్నెట్ వినియోగంలో ఎదురయ్యే ప్రమాదాలపై వివరించారు. ప్రతి ఒక్కరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని, పరిసరాల్లో అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా సంబంధిత వారికి తెలియజేయాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు ఆత్మరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌కు ఎక్కువ సమయం కేటాయించకుండా ప్రతిరోజూ ఆటలు ఆడాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. సైబర్ నేరాలు జరిగితే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు, న్యాయ సలహాల కోసం 15100కు ఫోన్ చేయాలని సూచించారు.

అనంతరం బాలికల స్వీయరక్షణపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాన్ని వీక్షించి అభినందించారు. విద్యార్థులు స్వయంగా తయారుచేసి అందించిన పుష్పగుచ్ఛాన్ని స్వీకరించి వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్య, ఉపాధ్యాయులు, టీఎస్‌యుటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు