108 సిబ్బంది నిజాయితీ
28-10-2026 | 10:01pm
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నగదు కుటుంబానికి అప్పగింత
గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన దానబోయిన రమేష్ తీవ్రంగా గాయపడగా 108 సిబ్బంది అతన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
అతని వద్ద ఉన్న రూ.లక్ష నగదును ఈఎంటి బాలరాజు , పైలట్ రసీదులు నిజాయితీగా వ్యవహరించి రమేష్ కుమారుడు రాజ్ కుమార్ కు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా బాధ్యతతో వ్యవహరించిన సిబ్బందిని కుటుంబ సభ్యులు అభినందించారు.