చదువుతోనే బంగారు భవిష్యత్తు

28-10-2026 | 10:27pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుపై దృష్టి సారించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర(Senior Civil Judge Sanket Mitra), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలోని హోలీ ట్రినిటీ, పీఎం శ్రీ టీజీఎంఎస్, వాసవి హైస్కూల్, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో న్యాయ సేవలపై అవగాహన కల్పించారు.

బాలల రక్షణ, బాల్య వివాహాల నివారణ, విద్యా హక్కు, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు. ఆపదలో ఉన్న బాలలు 1098 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు