రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గ్రాట్యుటీ చెక్కు అందజేత

28-10-2026 | 10:28pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి):శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో(Sri Saraswati Shishu Mandir School) 33 ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఆచార్యుడు శ్రీరామ్ సత్యనారాయణకు రూ.5 లక్షల గ్రాట్యుటీ చెక్కును జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కొత్తపల్లి అనిత అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాపీఠంలో సేవలందించిన ఆచార్యులకు గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమాండ్ల రాజన్న, పాఠశాల కార్యదర్శి భోగ మధుకర్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, తొగరి పెంటయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు