అవినీతిని అంతం చేయడమే ఆప్ సిద్ధాంతం
భూపాలపల్లి టౌన్, నవంబర్ 26 (విజయక్రాంతి): అవినీతిని అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఆవిర్భవించిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Foundation Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరి సంతోష్ కుమార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించగా, జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ పార్టీ జెండాను (Party Flag) ఆవిష్కరించారు.
అనంతరం అరవింద్ మాట్లాడుతూ.. 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది సభ్యులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారని తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఆవిర్భవించిన కొన్నేళ్లలోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అరవింద్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్ అస్లాం, పట్టణ నాయకులు మురళి, శ్రావణ్, శివ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.