భూముల రీ-సర్వే పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్

16-09-2026 | 01:55pm

టేకుమట్ల మండలంలో రీ సర్వేను పరిశీలన 

అధికారులకు పలు సూచనలు 

భూపాలపల్లి రూరల్ / టేకుమట్ల, సెప్టెంబర్ 16( విజయక్రాంతి) : భూముల రీ సర్వే ప్రక్రియను పొరపాట్లు లేకుండా నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్(Additional Collector) పి అశోక్ కుమార్ అన్నారు. టేకుమట్ల మండలం రామకిష్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న నాన్‌ కెడస్ట్రల్ భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అదనపు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే విధానం, భూ రికార్డులను ఆయన  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించి, రికార్డుల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రీసర్వే అనంతరం రూపొందించే డిజిటల్ భూ రికార్డులు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి కుసుమ కుమారి, తహసీల్దార్ స్వరూపరాణి,  రెవెన్యూ, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు