నాగల్ గిద్ద మండలంలో సబ్‌కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఎస్‌ఐఆర్ పరిశీలన
ఫామ్‌పాండ్ పనుల తనిఖీ
పాఠశాలలో విద్యాబోధనపై ఆరా
నాగలిగిద్ద,సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): నాగలిగిద్ద మండలంలోని పలు ప్రాంతాల్లో సబ్‌కలెక్టర్(Sub Collector) ఉమాహారతి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు.ఇరాక్‌పల్లిలో ఉపాధి హామీ పథకం కింద రూ.1.17లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న ఫామ్‌పాండ్ నిర్మాణ పనులను పరిశీలించి,నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శేరి దామరగిద్ద ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు.
టీఎల్‌ఎం వినియోగం,బోధనా విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.అలాగే మండలంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో తహసీల్దార్ శివకృష్ణ, ఎంపీడీవో మహేశ్వరరావు, ఏపీవో మురళి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి, టీఏ సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ శివాజీ, కార్యదర్శి రాజయ్యస్వామి, ప్రధానోపాధ్యాయులు గణపతి చౌహన్ తదితరులు పాల్గొన్నారు