నార్కోటిక్ డాగ్‌తో హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు

16-09-2026 | 01:31pm

గంజాయి, మాదకద్రవ్యాలపై తనిఖీలు

కోనరావుపేట సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఎస్సై బండారి రామ్మోహన్(SI Bandari Rammohan) ఆధ్వర్యంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ సహాయంతో గ్రామంలోని హోటళ్లు, దుకాణాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల నిల్వ, విక్రయాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు పరిశీలించారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా అక్రమంగా గంజాయి లేదా ఇతర డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.గ్రామంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు