నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు :సీఐ
16-09-2026 | 01:39pm
డీజే నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 16 ( విజయక్రాంతి ) : డీజే(DJ) నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక డీజే నిర్వాహకులతో సీఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగముగా అధిక శబ్దంతో వినియోగించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేయద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ డీజే నిర్వాహకులను హెచ్చరించారు.