పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గణపురం, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): గత మూడు రోజులుగా కురిసిన తుఫాను వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం(Government) వెంటనే ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం గణపురం తహసీల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) సీనియర్ అసిస్టెంట్ దేవేందర్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆయనకు వినతిపత్రం అందించారు.
భారీ వర్షాలతో మిర్చి, వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయని, క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం అందించాలని కోరారు. పంట నష్టపరిహారం, బీమా మొత్తాలను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ తిక్క సంపత్, మండల మైనార్టీ నాయకుడు ఎండీ సైదులు పాషా, బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.