ఈఎల్ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు
30-10-2026 | 10:59pm
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ఈ ఎల్ ఈ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఎమ్మెల్సీ పట్టబద్దుల ఓటు నమోదు కార్యక్రమం లో యువత నుండి మంచి స్పందన లభించిందని ఓటు వేసే క్రమంలో కూడా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఈ ఎల్ ఈ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎల్ ఈ ఫౌండేషన్ కార్యకర్తలు అశోక్, రాపోల్ నవీన్, శివరాత్రి శ్రీశైలం, శివరాత్రి వంశీ, ఆలకుంట్ల చందు, కాలూరి విజయ్, శివరాత్రి చందు కుమ్మరాజుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.