బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం

30-10-2026 | 11:06pm

బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి

 గాయపడిన ప్రవళికను పరామర్శించిన నేత

 బాధితురాలు త్వరగా కోలుకోవాలని

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): కొత్తగూడెం విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు కండక్టర్‌( RTC bus conductor)పై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) పేర్కొన్నారు. మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికపై ఇటీవల ప్రయాణికులు దాడి చేసి బస్సు కిందకు తోసేయడంతో ఆమె రెండు కాళ్లతో పాటు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సాయి సంజీవిని ఆస్పత్రి(Sai Sanjeevini Hospital)లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్స వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘోర ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితురాలికి ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతానికి చెందిన ప్రవళిక, తండ్రి మరణానంతరం వచ్చిన వారసత్వ ఉద్యోగంతో కుటుంబాన్ని పోషిస్తోందని గుర్తుచేశారు. కష్టపడి పనిచేసే ఇలాంటి ఉద్యోగులపై దాడులు జరగడం విచారకరమన్నారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పి, బాధితురాలు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. .

మరిన్ని వార్తలు