దుర్గాదేవి రూపంలో అమ్మవారి దర్శనం
18-10-2026 | 03:57pm
గణపురం అక్టోబర్ 18 (విజయక్రాంతి): మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో(Navratri Utsav) భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గా దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు వినయ్ ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.