కొడవటంచ ఆలయ పనులు గడువులోగా పూర్తి చేయాలి

25-11-2026 | 04:49pm

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి/రేగొండ, నవంబర్ 25 (విజయక్రాంతి): కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao), కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించారు. కళ్యాణ మండపం పూర్తికాగా, డార్మెటరీ, షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.

కోనేరు, కాంపౌండ్ వాల్, టాయిలెట్ బ్లాక్‌లు, డ్రెస్సింగ్ రూమ్‌లు, మహామండపం, సింహద్వారం తదితర పనులను డిసెంబర్ నెలాఖరులోగా, స్టోన్ క్లాడింగ్ పనులను జనవరి 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, అవసరమైన మేరకు కార్మికులు, నిర్మాణ సామగ్రిని సమకూర్చుకుని వేగం పెంచాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే, కలెక్టర్ స్వామివారిని దర్శించుకోగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు