ఎంపీడీవో కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్తం

28-10-2026 | 06:09pm
  1. కార్యాలయానికి తాళం.. గంటపాటు సిబ్బంది పడిగాపులు
  2. మహిళా అటెండర్‌ రాకపోవడంతో తాళం పగలగొట్టి లోనికి వెళ్లిన ఉద్యోగులు

గణపురం, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): గణపురం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)(Mandal Parishad Development Officer) కార్యాలయంలో బుధవారం ఉదయం సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. సమయానికి విధులకు హాజరైన ఉద్యోగులకు కార్యాలయ ప్రధాన ద్వారం తాళం వేసి కనిపించడంతో సుమారు గంటపాటు బయటే నిరీక్షించాల్సి వచ్చింది.

రోజువారీగా నిర్ణీత సమయానికి సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నప్పటికీ, కార్యాలయాన్ని తెరిచి శుభ్రం చేయాల్సిన మహిళా అటెండర్‌ సమయానికి రాకపోవడంతో తాళం తీయలేదు. దీంతో ఉద్యోగులు వరండాలోనే వేచి చూశారు. ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో అధికారిక పనులకు ఆటంకం ఏర్పడింది. చివరకు చేసేదేమీ లేక సిబ్బంది తాళం పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు.

ఈ ఘటనతో కార్యాలయ దైనందిన కార్యకలాపాలు ఉదయం వేళ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, బాధ్యతాయుతంగా విధుల నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు