వర్కింగ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం

28-10-2026 | 07:29pm

గుండాల, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జర్నలిస్టులు(Journalists) బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొని పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు.

వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ, జర్నలిస్టుల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ చర్చలలో భాగంగా సమాచారం లేని వార్తలు గానీ, ప్రెస్ మీట్ లకు పిలవని వార్తలు గానీ ప్రచురించబోమని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం నుండి పది రోజులపాటు ఎటువంటి ప్రెస్ మీట్ లు గాని ప్రకటనలు గాని ప్రచురించమని వారు స్పష్టం చేశారు.

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని అటువంటి జర్నలిస్టులను గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ - గుండాల ఆర్గనైజర్స్ గా వెలిశాల నరేష్ (విజయ క్రాంతి), తవిడిశెట్టి రాము (నవ తెలంగాణ), బత్తిని వినయ్ (తెలంగాణ క్రాంతి), మంకిడి సుధాకర్ (ఎస్బీ టీవీ), చేబోతు రంజిత్ (నినాదం) లను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు మలిపెద్ది పవన్(ప్రతి పక్షం), వాంకుడోత్ జగన్ (మన భద్రాద్రి న్యూస్), సల్లూరు సురేష్ (నేటి ధాత్రి), పల్లెర్ల రవి వర్మ (డీడీ వార్త), కొంతం నాగార్జున (ఈ మాట), బొమ్మెర్ల రవి (కాకతీయ), ఎట్టి సుందర్ (ఫాస్ట్ న్యూస్), పూనెం రమణ బాబు(కొమరం భీమ్), నర్సింహా రావు (టీవీ 999), గణేష్ (డీఆర్బీ న్యూస్), యనగంటి రమేష్ (మనం న్యూస్) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు