ఆర్టీఐ చట్టంపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం(State Right to Information Act) ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి(Commissioner Dr. G. Chandrashekhar Reddy) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా సమాచారం అందించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ కమిషనర్ల సూచనల మేరకు అధికారులకు అవగాహన కల్పించి, ప్రజలకు సకాలంలో సమాచారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సమాచార కమిషనర్లు, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.