కార్తీక దీపోత్సవానికి నూనె క్యాన్ల వితరణ

20-11-2026 | 04:49pm

గణపురం, నవంబర్ 20 (విజయక్రాంతి): కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఈనెల 24న మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం (Karthika Deepotsavam) కోసం నూనె క్యాన్లను దాతలు అందజేశారు.

కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే దీపోత్సవానికి గణపురం మండల కేంద్రానికి చెందిన బోనాల ఉమాదేవి, రాజమౌళి, అనులేఖ, ప్రబోధన్ దంపతులు శుక్రవారం ఆలయానికి నూనె క్యాన్లను సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు దాతలకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దీపోత్సవానికి నూనె అందించిన దాతల కుటుంబానికి కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు