కుటుంబ భద్రతకు ఇందిరమ్మ బీమా భరోసా
నల్లబెల్లి, నవంబర్ 20( విజయక్రాంతి ): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత(Financial Security) కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 'ఇందిరమ్మ కుటుంబ బీమా భరోసా(Indiramma Family Insurance Assurance)' పథకాన్ని అమలు చేస్తోందని పీఏసీఎస్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు(PACS Chairman Errabelli Raghupathi Rao) అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామపంచాయతీ(Ramatirtham Grama Panchayat) ఆవరణలో సర్పంచ్ పొదిల్ల వసంత శోభన్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘుపతిరావు మాట్లాడుతూ. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ బీమా భరోసా అండగా నిలుస్తుందని వివరించారు. పథకం ప్రయోజనాలు, అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ నాగ పద్మజ, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ పింగిలి రమణారెడ్డి, ఏపీఎం సుధాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇస్తారు శేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్లు చార్ల శివారెడ్డి, బత్తిని మల్లయ్య, మామిళ్ల రాజిరెడ్డి, త్రికోవెల మురళి, ఉపసర్పంచ్ ఎండీ తహేర యాకూబ్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏఈఓ శివకుమార్, జీపీఓ ఐలేష్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.