పోలీస్ కార్యాలయంలో కొలువుదీరిన గణనాథుడు

15-09-2026 | 10:39pm

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి(Ganesh Chaturthi) ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetty Sankeerth) మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ వినాయక నవరాత్రి ఉత్సవాలను(Vinayaka Navratri celebrations) భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జన శోభాయాత్ర పూర్తయ్యే వరకు పోలీస్ శాఖకు సహకరించి, సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు సంతోష్ కుమార్, కాశీరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు