జనం నడిపిన విప్లవమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం

15-09-2026 | 11:10pm

సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం

మునుగోడు,(విజయక్రాంతి): నిజాం ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ ప్రభువుల అణిచివేత దోపిడీకి,కష్టాలు, కన్నీళ్లు, వెట్టిచాకిరీ, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలే వ్యతిరేకంగా జరిగిన మహోన్నతమైన జనం నడిపిన విప్లవ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం(Telangana Armed Peasant Struggle) అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(Farmers' Association) జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం అన్నారు. మంగళవారం మండలంలోని పలివెల గ్రామంలో తెలంగాణ సాయుధ రైతన్న పోరాట వారోత్సవాలు ఘనంగా ఏర్పాటుచేసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

పోరాడి అమరులైన కొండవీటి గురునాథరెడ్డి, బుచ్చిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గోస్కొండ పెద్దలు స్థూపాలకు పూలమాలవేసి జోహార్ అర్పించి మాట్లాడారు.భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు దొరలకు జాకీర్దారులకు భూస్వాములకు పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఆనాడు సాయుధ పోరాటం జరుగుతున్న సందర్భంలో పలివెల గ్రామానికి చెందిన కొండవీటి గురునాథరెడ్డి బచ్చిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గోస్కొండ పెద్దులు మరికొంతమంది నాయకులు జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థను కూడ తెలియడంలో ప్రముఖ పాత్ర పోషించి పేద ప్రజల పక్షాన అండగా నిలిచారని అన్నారు. నాటినుండి నేటి వరకు పలివెల కమ్యూనిస్టు పార్టీలకు బలమైన కేంద్రం అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు