రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

28-10-2026 | 09:50pm

గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరికీ గాయాలయ్యాయి. మండలంలోని అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన దానబోయిన రమేష్, గణపురం మండల కేంద్రానికి చెందిన ఉబ్బిడి సందీప్ లకు గాయాలయ్యాయి. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న క్రమంలో అప్పయ్య పల్లికి చెందిన రమేష్ కాలు నుజ్జు  నుజ్జయింది.

ప్రమాదం జరిగిన అనంతరం మండల కేంద్రానికి చెందిన ఉబ్బిడి సందీప్ ఇంటికి వెళ్లి అస్వస్థకు గురికాగా అతని కుటుంబ సభ్యులు గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి(Ganapuram Primary Health Centre) తీసుకు వస్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో వాహనంపై ఉన్న సందీప్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా మరో వ్యక్తి జక్కు రవిని కూడా ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన కారణం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ రమేష్ ను భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.రమేష్ పరిస్థితి విషమంగా ఉంది.

మరిన్ని వార్తలు