బీఎల్‌ఓ విధులతో అదనపు భారం

16-09-2026 | 08:29am

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ సిబ్బంది ధర్నా

గద్వాలటౌన్‌: గద్వాల పట్టణంలోని 11వ వార్డు అంగన్‌వాడీ 2వ సెంటర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న డి.విజయ శనివారం విధుల్లోనే గుండెపోటుతో(Heart attack) మృతి చెందారు. ఆమె అంబేద్కర్‌నగర్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ 237కు బూత్‌ స్థాయి అధికారిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లపై బీఎల్‌ఓ పరిధిలోని అదనపు పనులు అప్పగించడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని సిబ్బంది ఆరోపించారు. విజయ మృతికి పని ఒత్తిడే కారణమని పేర్కొంటూ కలెక్టరేట్‌(Collectorate) ఎదుట ధర్నా నిర్వహించారు.పని భారం తగ్గించాలని అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బీఎల్‌ఓ విధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.అనంతరం అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు