టీఆర్పీలోకి భారీగా చేరికలు!
ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కి (Congress Party) చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు (Beesam Anjaneyulu) ఆధ్వర్యంలో కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన గాడి గా ఈశ్వర్‌గౌడ్, వడ్డెమన్ నాగరాజు, చెనరెడ్డి సతీష్, నడింపల్లి అమరేందర్ గౌడ్, ముద్దామోలా నిరంజన్, మద్దూనాగుల రమేష్,
ఆవుల పర్వతమ్మ, అతినారపు అనురాధ, కౌకుంట్ల వెంకటయ్య, నీలమ్మ, శివలీల, లక్ష్మి, సుశీల, రాధ, మాధవి, కొండమ్మ, పుష్పలత, రాములు, పర్వతాలు, సైదన్న, కుర్మయ్య.. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న సమక్షంలో మంగళవారం టీఆర్పీలో చేరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీల, రాజ్యాధికారమే లక్ష్యంగా టీఆర్పీ ముందుకు సాగుతుందన్నారు.
సెప్టెంబర్ 17న నిర్వహించ తలపెట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ ను జిల్లా ప్రజలు, బహుజన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ నారముని నరేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు తవిటి శైలజ, లింగాల మండల అధ్యక్షులు ఆవుల యాదగిరి పాల్గొన్నారు. భారత సైన్యంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించి, పలు యుద్ధాల్లో ఎంతో మంది సైనికుల ప్రాణాలు కాపాడిన రిటైర్డ్ సుబేధార్ మేజర్ నరసింహ రాము లు..
కల్నల్ బిక్షపతి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీ లో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేములవాడ మదనమోహన చారి, రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు సల్మాన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పిట్టల సురేష్, జిల్లా నాయకులు బబ్బులు పాల్గొన్నారు.
మల్లన్నను కలిసిన బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు
బీసీ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు పరమేశ్, ఏపీ అధ్యక్షుడు చింత నాగరాజు ఆధ్వర్యంలో ఉద్యోగు ల సంఘం బృందం మంగళవారం టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో తీన్మార్ మల్లన్నను కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ శాసనమండలిలో బీసీల హక్కుల కోసం,వారి సంక్షేమం కోసం మల్లన్న అనుక్షణం గర్జించిన తీరు మునుపెన్నడూ లేని విధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈ ఆంజనేయులు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్, బీసీ ప్రతినిధులు గిరిరాజ రవి శంకర్, యుగంధర్, శ్రీనివాస్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.