ఎర్రపహాడు లో యజ్ఞం...

15-10-2026 | 04:49pm

తాడ్వాయి,అక్టోబర్,15 ( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామ(Errapahadu village) శివారులోని శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం లో గురువారం భక్తులు ప్రత్యేకయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురవాలని ప్రజలను కాపాడాలని భగవంతున్ని ప్రార్థించారు.

సరైన వర్షాలు లేకపోవడంతో వేసుకున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని వాటిని కాపాడాలని భగవంతున్ని వేడుకొన్నారు.చిట్యాల సాయన్న మాట్లాడుతూ.. గత నెల రోజుల నుంచి తాను ప్రతిరోజు ఈ దేవాలయంలో యజ్ఞం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు చిట్యాల సాయన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు