బాలసదనం చిన్నారి దత్తత
కామారెడ్డి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి బాలసధనoలో ఉన్న చిన్నారిని బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లికి చెందిన దంపతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో(Kamareddy Collectorate) కలెక్టర్ ఆశిష్ సంగువాన్(Collector Ashish Sangwan) చేతుల మీదుగా దత్తత పత్రాన్ని పొందారు.
చిన్నారులకు ప్రేమ పూర్వక కుటుంబ వాతావరణం కల్పించి వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని లక్ష్యంతో ప్రభుత్వం దత్తత ప్రక్రియ అమలు చేస్తుందని కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. చిన్నారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని శిశు మహిళా సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్డెంట్ అరుణ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.