దీపావళిపై మోదీ ఆసక్తికర సందేశం

07-11-2026 | 10:09am

న్యూఢిల్లీ, నవంబర్ 7: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, నిరాశపై ఆశ సాధించే శాశ్వత విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, జీవితాల్లో Positive Thinking పెంపొందించాలని మోదీ ఆకాంక్షించారు. ఇతరుల పట్ల దయాగుణాన్ని చాటుకుంటూ, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని సందేశమిచ్చారు. భారత ప్రభుత్వానికి చెందిన 'జన్ సంపర్క్ పోర్టల్'లో ప్రధాని ఈ మేరకు Diwali Wishes వెల్లడించారు. వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆశ, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు