సమస్యలు పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

28-10-2026 | 10:06pm

అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ గుప్తా

కామారెడ్డి,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా ఏర్పాట్ల లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శానిటేషన్, వీధి దీపాల సమస్య పరిష్కరించాలని అన్నారు, అన్ని శాఖలలో అవినీతి పేరుకు పోయిందని నిరసిస్తూ మున్సిపల్ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి మునిపల్ ఫ్లోర్ లీడర్ మోటురీ శ్రీకాంత్  మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండగ ఏర్పాట్ల లో నిర్లక్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలనీ అన్నారు. అధికారులకు వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదనీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలనీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రతి వీధి దీపాలు వెలిగేలా చూడాలనీ అన్నారు. క్రమం తప్పకుండా చెత్త బండి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

శానిటైజేషన్ శాఖలో అవినీతిపై విచారణ చేపట్టాలనీ అన్నారు,  మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో అవినీతిని రూపుమాపాలనీ అన్నారు.  రోడ్ల పై చెత్తను ప్రతి రోజు తీసివేయాలనీ అన్నారు. పాడైన మోటార్లను వెంటనే రిపేరు చేయాలని, ఇంటింటికి త్రాగు నీటి సరఫరాపై అధికారులు నిర్లక్ష్యం వీడాలనీ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ లో అవినీతి అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, భాను ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు